తెలుగు ప్రజల ఇలాంటి డిమాండ్ లను ఇపుడు కాకపోతే ఎపుడు కోరతారు?

రాష్ట్ఱ విభజన కు అనుకూలంగా ఉన్నవారు, విభజన తప్పదని భావించేవారు, రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నతెలుగువారి అభివృద్ధిని కాంక్షించేవారు స్పష్టమైన ముందస్తు నిధులహామీ, రాజ్యాంగ రక్షణ తో కూడిన డిమాండ్ లను ఎందుకు చేయరు? ఇపుడు చేయకపోతే ఎపుడు చేస్తారు?
ఈ విషయంలో తెలంగాణ మిత్రులు వారి ప్రాంతానికి కొంతవరకు వారి డిమాండ్ ల విషయం లో ముందున్నారు. విస్పష్ట సూచనలతో కూడిన GoM కు పంపిన వివరాలను జతపరచిన లేఖ చూడండి. ఆమోదమైతే సమర్ధించండి, ఉద్యమించండి. మరెపుడూ ఈ అవకాశం రాదు.
ఇవన్నీ జరుగుతాయా, ఇంతకు ముందు ఏర్పడిన రాష్ట్రాలకు ఏంజరిగింది అనే ఆలోచిస్తూ కూర్చుంటే ఏం జరగదు కదా.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిస్వార్ధంగా ఎవరైనా కోరుకుంటే వారిని తప్పుపట్టలేము. అలా నినదించేవారిని వదిలేస్తే, సమైక్యరాష్ట్రం కొనసాగుతుంది, విడదీయనీయం, అని నినదించే నకిలీ సమైక్యవాదులు, నాటకాలడేవారు విభజన నిర్ణయం వెలువరించిన తర్వాత ఈ రెండు నెలల కాలంలోఆ దిశగా సాధించిన ఒక్క అనుకూలత చూపించండి.
ఈ క్రాలిష్జట దశలో ముందుండి నడిపించాల్సిన రాజకీయ పార్టీలు ప్రజలను వదిలేసి వారి వారి స్వార్ధ రాజకీయాలను మాత్రమే అనేక నాటకాలతో, విన్యాసాలతో ఇతర పార్టీలను నాశనం చేయాలనే లక్ష్యంతో మాత్రమే ప్రజలను మభ్యపెడుతున్నాయి. దీనికి ఏ రాజకీయపార్టీ అతీతం కాదు.
మేధావుల్లారా, ఇకనైనా మేల్కోండి, ఇవీ మా డిమాండ్ లు అని విస్పష్ట డిమాండ్ ల ను ప్రభుత్వం ముందుంచండి. స్పష్టమైన ముందస్తు నిధులహామీ, రాజ్యాంగ రక్షణ ను కోరండి
Stop any more degrading agitations hampering the development of the Telugu People and suicides of innocent people of all the regions with these regional rivalries.
సమక్యాంధ్ర ఇంకా సాధ్యమా?

సమక్యాంధ్ర ఇంకా సాధ్యమా? రాజకీయ పార్టీలు కల్పించే భ్రమలనుంచి బయటపడి చూస్తే వాస్తవ పరిస్థితులు ఇంకా సమైక్యాంధ్ర కొనసాగటం సాధ్యం కాదనే తెలియచేస్తున్నాయి. కానీ ఒకటే కోరాలి, 1. సీమాంధ్ర రాజధాని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చెందేవరకు సమైక్యాంధ్రను కొనసాగనీయాలి. 2. సీమాంధ్ర, తెలంగాణ మధ్య నీటి పంపకాలు నిర్ణయం అమలు జరిపి విభజన ప్రక్రియ ప్రారంభించాలి, 3. ఉద్యోగ పరిశ్రమల వికేంద్రీకరణ నిర్ణయం అమలు జరిగిన తర్వాత విభజన ప్రక్రియ చేపట్టాలి. దీనికి కాలపరిమితి విధించాలి. ఇది కనీసంగా ఉండాలి. ఉదా: 2 సంవత్సరాల వ్యవధి (ఇది కేంద్రం కేటాయించే నిధులు, విధులు సరిగ్గా ఉంటే సాధ్యం కాదా? తెలంగాణ సోదరులు మరో 2 సంవత్సరములు ఆగటానికి అభ్యంతరం ఉండకపోవచ్చు. అలాగే సీమాంధ్ర సోదరులు హైదరాబాద్ పై పెట్టుకున్న మక్కువ వదులుకోవచ్చు. -------------------------- కారణాలు ఏమైతేనేమి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ప్రజలలో అనిర్వచనీయమైన భావోద్వేగాలు రెచ్చగొట్టబడ్డాయి. మనసులు దూరమౌతున్నాయి. ఒక ప్రక్క తీసుకున్న నిర్ణయాన్ని ధృఢచిత్తంతో అమలు చేయాలన్న బలమైన కాంగ్రెస్ పార్టీ వెనక్కుతగ్గే పరిస్థితి లేదు అన్నది సుస్పష్టం. ఇక రాష్ట్రంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీ గా విడిపోయి ప్రాంతాలుగా వారి వారి రాజకీయ బలాన్ని పెంచుకునే దిశగా ప్రజలను భావోద్వేగాల ఆధారంగా పావులను చేయటం చూస్తూనే ఉన్నాం. --------------------------- కాంగ్రెస్ పార్టీ - "తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే" నిర్ణయం అమలుచేయగల బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ. తీసుకున్న నిర్ణయాన్నిఇపుడున్న పరిస్థితులలో ఇక వెనక్కు తీసుకోదు. ఇది అనేక సందర్భాలలో స్పష్టం అయ్యింది, అవుతూ ఉంది. ఆ పార్టీ నేతలు రెండు ప్రాంతాలలో ఎలాంటి నాటకాలు ఆడుతున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. ఒక రకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అక్కడి ప్రజలకు ఇపుడు అంత భ్రమలు కల్పించటంలేదు, నాటకాలు చాలించారు. కానీ సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాత్రం పీక్ లెవెల్లో డ్రామాలు మొదలుపెట్టారు. ఎలాగోలా కాంగ్రెస్ తీసుకున్నరాష్ట్ర విభజన నిర్ణయం కు బాధ్యులుగా తె.దే.పా, మరియు వై.కా.పా లను నిలబెట్టాలనే ప్రయత్నంతో పాటు, బ్రహ్మాస్త్రాలు ప్రయోగించి సమైక్యాంధ్రా ను సాధిస్తాం అనే మోసంతొ ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ లోపల సోనియా గాంధీ ముందు పోరాటం చేసే ధర్యం లేని వీరు పార్లమెంట్ బయట పోరాటం నాటకం ఆడుతూ నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఇలాంటి వారు ఏ విధంగా అధిస్టానాన్ని వ్యతిరేకిస్తారో మనం ఆలోచనలోకి కూడా రాదు. ఎవ్యరూ నమ్మరు. ఇంతకాలం నాటకమాడినట్లే ఇకముందుకూడా చివరి వరకు ( కనీసం 2014 ఎన్నికల వరకు) ఇలా నాటకమాడటం, ప్రజలను ఓట్టకోసం నమ్మించాలని చూడటం వారి అవసరం కూడా. వారు చేస్తున్నది అదే. ఇది ప్రజలు గమనించాల్సిందే. ఇక సోనియా ముందు పిల్లి లాగా ఉండే మరో సీమాంధ్ర పార్లమెంట్ సభ్యుడైతే ఉభయప్రాంతాల ప్రజలను రెచ్చగొడ్తూ, అగ్నికి ఆజ్యం పోసేటట్లు మాట్లాడుతూ తనదగ్గర ఏవో బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని భ్రమింపచేస్తూ, టీవీ ఛానల్స్ లో ప్రెస్ మీట్ ల పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలనిస్తూ ప్రజలను మభ్యపెడుతూ విద్వేషాలను ఆగనీయకుండా అగ్ని రాజేస్తూ తన ప్రమాదకరమైన రాజకీయ క్రీడ కు ప్రజలను బలిచేస్తున్నాడు. ఇలాంటి వారి వల్లే రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు అత్యంత ప్రమాదం పొంచి ఉంది. ---------------------- ఇక తెలుగుదేశం పార్టీ - "తెలంగాణ ఇచ్చే శక్తిలేదు, ఇస్తే అడ్డుకునే శక్తి లేదు" కాంగ్రెస్ పార్టీ తె.రా.స. తో కలిసి తెలంగాణలో తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో, సీమాంధ్రలో యువజన శ్రామిక రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ కు వచ్చిన సానుభూతి పవనాలలో ఎక్కడ సీమాంధ్రలో బలహీనమైపోతామేమో అనే ఆందోళనలో, తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడలేక, సమర్ధించుకోలేక, ఒక నిర్దిష్ట విధానం పై పార్టీ నాయకులను, కాడర్ ను నడపలేక నిర్ణయాత్మకమైన విధానాలను, విమర్శలనుచేయలేని గందరగోళంలో పడిపోయి తన స్వంత కాడర్ ను, నాయకులను మాత్రమే కాక ప్రజలను కూడా గందరగోళంలోకి నెట్టేసే స్థితికి దిగజారిపోయింది. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ పార్టీ అధినాయకుడితో అవగాహన, పరిపాలన దక్షత కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరెవరూ లేరనేది అనేక మంది భావన. అలాంటి నాయకుడు ఈ పరిస్థితులలో కొట్టుమిట్టాడటం, దిశా నిర్దేశనంచేయలేని స్థాయికి దిగజారిపోవటం నిజంగా బాధాకరం. పార్టీతో తీసుకున్న నిర్ణయానికి నిబద్దులై ఉంటే, ఆవిధంగా కార్యక్రమాలు చేస్తూ అనుభవం వలన వచ్చిన పరిణితిని ఉపయోగాంచుకున్నట్లైతే ఆ పార్టీని విభజనకు అనుకూటాంగా ఉన్నప్పటికీ, సామాంధ్ర అభివృద్ధిపై పోరాటం చేస్తే వారికి కలిసి వచ్చేది. కాని పార్టీలో తెలంగాణ నాయకులదొక మాట్, బాట. రాయలసీమ నాయకులదొక మాట, బాట, కోస్తాంద్ర నాయకులదొకమాట, బాట. ఇలా మాటలు, బాటలు వేరై అసలు స్టాండ్ ఏమిటనేది ప్రజలకు అర్ధం కాక, పార్టీనే అర్ధాంతరంగా ఏమైపోతుందో తెలియని పరిస్తితి. ---------------------- యువజన, శ్రామిక, రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీ - "తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తాం, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం సత్వరంగా నిర్ణయం తీసుకోవాలి". మాలో స్పష్టత ఉందని నినదించే ఈ పార్టీ తన పార్టీ పూర్త్తి పేరు కూడా స్పష్టంగా ఎక్కడా చెప్పుకోలేని పార్టీ. ఆంగ్లంలో దివంగత డా. వై.యస్. రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చే విధంగా యువజన, శ్రామిక, రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీ అని పేరు పుట్టుకున్నారు. ఎందుకంటే డా. వై.యస్. రాజశేఖర రెడ్డి గారి పేరుకు ఆ నాడు ప్రజలలో ఉన్న అనుకూల వైఖరి. కాబట్టి పేరు పెట్టటం మొదలుకుని ఇప్పటి వరకు ప్రజలను ఒకరకమైన మోసపూరిత రీతిలో ముందుకు నడుస్తూ ఉంది, అదే విధంగా ప్రజా సమస్యలకంటే తనకు ముఖ్య ప్రత్యర్ధిగా ఎంచుకున్న తెలుగుదేశం ను, ఆ పార్టీ అధినేతను విపరీతధోరణితో ప్రజలలో దెబ్బతీసే క్రమంలో తన వార్తా పత్రిక, న్యూస్ ఛానెల్ "సాక్షి" ద్వారా అధికార ప్రతిపక్షాలకు ముడివేసి, కుమ్మక్కైయ్యారని ప్రచారం చేసుకుంటూ పోతూ, ఏ సందర్భంలోనైనా వారిని ఈ కుమ్మక్కు జిమ్మిక్కుతో తూర్పారబట్టటం వారికి దైనందిన కార్యక్రమం. ఇదే వారికి ఉన్న పెద్ద ఆయుధం. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు వారి వారి రాజకీయ ఎత్తుగడలలో వై.కా.పా కు లాభించే రీతిలో ఉండరు. అది కుమ్మక్కు అని ప్రజలు నమ్మితే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టి వై.కా.పా. ప్రభుత్వం వచ్చే రీతిలో తెలుగుదేశం పార్టీ ఉంటే అపుడు అది కుమ్మక్కు క్రిందికి రాదు. కాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టి వై.కా.పా. ప్రభుత్వం వచ్చే రీతిలో తె.దే.పా పనిచేస్తుందని, చేయాలని ఎవరూ ఊహించరు. ఇదంతా దివంగత డా. వై.యస్. రాజశేఖర రెడ్డి గారి పార్థీవ శరీరం ఇంటికి చేరక ముందు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలు, వార్తలు చూస్తుంటే వై.కా.పా. యొక్క అధికార వ్యామోహం ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. తెలంగాణ లో చాపచుట్టేసే పరిస్థితి వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో శ్రీమతి విజయమ్మగారు నినదించిన పార్టీ విధానాన్ని ఇపుడు ఎలా మార్చారో ఎందుకు మార్చారో సుస్పష్టం. తెలంగాణ కు పరిమితమైన తె.రా.స. అక్కడ ప్రాంతం వారికి మాత్రమే చెందిన పార్టీ కాబట్టి తెలంగాణ పై మాత్రమే ఎంతైనా దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది. అదే ఆ పార్టీ బలం. దానిని ఆసరాగా తీసుకునే అక్కడ అది ఛాంపియన్ కాగలిగింది. అదే విధానంలో, అదే స్ఫూర్తితో తెలంగాణలో ఎలాగూ బలం కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి సీమాంధ్రలో సమైక్యవాదంతో, సీమాంధ్రకు పరిమితమైపోయి తెలంగాణలో తె.రా.స. వలె, సీమాంధ్రలో వై.కా.పా ను నిలపాలనేదే ప్రస్తుత వై.కా.పా. ఎత్తుగడ, శ్రీమతి విజయమ్మ దీక్ష. ---------------------------- ఈ పరిస్థితులలో తెలుగు ప్రజలకు ఒకే ఒక వినతి. రాజకీయ పార్టీల మాటలు విశ్వాసంలోకి తీసుకోవద్దు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బాగుండాలి, ప్రగతిపధంలో ముందుకు సాగాలి, మిగతా వారికి మార్గద్శకులుగా గుర్తించబడాలి అనేదే ఈ పోస్ట్ ధ్యేయం. అందుకే మొదట ఉదహరించిన వాటిని మరొక్కసారి ఇక్కడ గుర్తుచేస్తున్నాను. "1. సీమాంధ్ర రాజధాని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చెందేవరకు సమైక్యాంధ్రను కొనసాగనీయాలి. 2. సీమాంధ్ర, తెలంగాణ మధ్య నీటి పంపకాలు నిర్ణయం అమలు జరిపి విభజన ప్రక్రియ ప్రారంభించాలి, 3. ఉద్యోగ పరిశ్రమల వికేంద్రీకరణ నిర్ణయం అమలు జరిగిన తర్వాత విభజన ప్రక్రియ చేపట్టాలి. దీనికి కాలపరిమితి విధించాలి. ఇది కనీసంగా ఉండాలి. ఉదా: 2 సంవత్సరాల వ్యవధి (ఇది కేంద్రం కేటాయించే నిధులు, విధులు సరిగ్గా ఉంటే సాధ్యం కాదా? తెలంగాణ సోదరులు మరో 2 సంవత్సరములు ఆగటానికి అభ్యంతరం ఉండకపోవచ్చు. అలాగే సీమాంధ్ర సోదరులు హైదరాబాద్ పై పెట్టుకున్న మక్కువ వదులుకోవచ్చు."

ఈ పాట ఏ సినిమాలోదో చెప్పరూ! ప్లీజ్!

నేను అనేక పాత సినిమి పాటలు సేకరించాను, సేకరిస్తూనే ఉన్నాను. అయితే నాకు చాలా కాలంగా ఒక పాట లోని కొద్ది భాగం మాత్రమే స్ఫురిస్తుంది. కాని దాని వివరాలు తెలియటం లేదు, అన్వేషణ కొనసాగుతూనే ఉంది. పాట లోని ఆ భాగం క్రింద చూడండి.
"గులాబిల నీడల లోన ముళ్ళున్నాయ్ చూసుకో!
ప్రేమంటే మజా కాదులే . . . . . . . . . . . "
దీని ట్యూన్ ఇలా ఉంటుంది: సౌ సాల్ పెహలే ముఝే తుమ్సే ప్యార్ థా, ముఝే తుమ్సే ప్యార్ థా, ఆజ్ భి హై, ఔర్ కల్ భి రహేగాదయచేసి ఎవరైనా తెలిస్తే వివరాలు (కొంచెమైనా) ఇవ్వ వలసిందిగా సవినయంగా కోరుతున్నాను.