ఫైర్ ఫాక్స్ కు తెలుగుదనం

Mozilla Firefox browser కు తెలుగుదనం కల్పించటానికి శ్రీ వీవెన్ గారు నాకు ఒక పద్దతి నేర్పారు. శ్రీ వీవెన్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇది మరింతమందికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతొ ఇక్కడ ఫొందుపరుస్తున్నాను.

1. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.

2. పైన ఉన్న టూల్స్ మెనూ లో ఉన్న ఆప్షన్స్ ఎంచుకోండి.


3. అలా వచ్చిన డైలాగ్ బాక్స్ లొ Content అనే Tab నొక్కండి ఈ క్రింది డైలాగ్ బాక్స్ వస్తుంది.4. ఆ తర్వాత Fonts & Colors అనే విభాగం ప్రక్కనే ఉన్న Advanced button నొక్కండి. క్రింద చూపిన విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది.

5. పై బొమ్మలో Brown Color పూసిన చోటల్లా డ్రాప్ డౌన్ మెనూ ఉపయోగించి మార్పులు చెయ్యాలి. మార్పులు చేసిన తర్వాత ఈ క్రింది విధంగా ఉండాలి.

6. తర్వాత క్రింది బొమ్మలో చూపిన విధంగా 6, 7 అని వ్రాసిన చోట OK నొక్కి close చేయాలి.

7. ఇప్పుడు మరల Tools>Options>Advanced Tab నొక్కండి. క్రింది డైలాగ్ బాక్స్ లో చూపిన విధంగా Languages విభాగం క్రింద Choose అనే బటన్ నొక్కండి.

8. ఇప్పుడు వచ్చిన డైలాగ్ బాక్స్ లొ Select a Language to add అనే విభాగంలొ డ్రాప్ డౌన్ మెనూ ద్వారా Telugu (te) అనే దానిని ఎంచుకుని add button నొక్కండి. క్రింది బొమ్మ చూడండి.


9. Languages in order of preference అనే బాక్స్ లొ కోత్తగా Telugu (te) చేరి ఉంటుంది, గమనించండి. ఆ తర్వాత Telugu (te) అనే దానిని సెలెక్ట్ చేసుకుని Move Up అనే బటన్ ద్వారా Telugu (te) ని మొదటి Language గా చేయండి. పూర్తయిన తర్వాత మీకు క్రింది విధంగా కనపడాలి. (Arrow mark నేను గీసినది, అది ఉండదు). ఆ తర్వాత పసుపు రంగుతొ హైలైట్ చేసిన 2 చోట్లా OK నొక్కి close చేయండి.


10. ఇప్పడు ఒకసారి Firefox Browser ను close చేసి Restart చేయండి. ఏదైనా ఒక సైట్ ఓపెన్ చేసి చూడండి. క్రింది విధంగా తెలుగుదనం కన్పించాలి. దానితొ ఈ ప్రక్రియ పూర్తయినట్లే.11. చాలా చిన్నదిగా , ఇబ్బంది గా ఫైర్ ఫాక్స్ లొ కనిపించే తెలుగు ఇప్పుడు చాలా చక్కగా తెలుగుదనం లోని తియ్యదనాన్ని చూపిస్తుంది.

గమనిక: >>> అప్పుడప్పుడు ఫైర్ ఫాక్స్ లో తెలుగు ఫాంట్ సైజ్ తగ్గిపోతుంది అప్పుడు ఈ చిట్కాలు పాటించండి.

6 comments:

Srinivas said...

కంప్యూటర్ లో తెలుగు రాదేమోనని ఇప్పటికీ చాలా మంది భావిస్తూఉన్నారు, అటువంటి పరిస్తితులలో కంప్యూటర్ లో తెలుగును జొడించడం గురించి చాలా సులువుగా, చక్కగా ఏ మాత్రం తెలియని వారకి కూడా అర్దమయ్యేరీతిలో బొమ్మలతో సహా చక్కగా వివరించారు.
ధన్యవాదములు,
శ్రీనివాస్ కర, మచిలీపట్నం

Narendhar said...

ప్రసాద్ గారు మన్ట నక్క లో తెలుగును జొడించడం గురించి చాలా సులువుగా, చక్కగా ఏ మాత్రం తెలియని వారకి కూడా అర్దమయ్యేరీతిలో బొమ్మలతో సహా చక్కగా వివరించారు.
ధన్యవాదములు
నరేన్

నల్లమోతు శ్రీధర్ said...

ప్రసాద్ గారు.. ఫైర్ ఫాక్స్ విషయంలో చాలామంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మీరు చాలా సులువుగా అర్థమయ్యేలా తెరపట్టులతో సహా పోస్ట్ చేయడం వల్ల ఎందరినో ఈ విషయంలో ఎడ్యుకేట్ చేశారు. మీరు ఇలాంటి మంచి పోస్టులు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తూ.. మీ బ్లాగు దినదినప్రవర్థమానమవ్వాలని మనసారా కోరుకుంటూ..

మీ
నల్లమోతు శ్రీధర్

peegeess said...

బాగుంది, ఇలా సరైన రీతిలొ తెలిపితే బాగా అర్థం అవుతుంది.
సురేష్
www.subhavaastu.com

ANNA said...

AYYAA PRASAAD GAAROO!!
MEERU CHEPPINA VIDHAMGAA CHeSINAPPATIKEE NAA COMPUTER LO TELUGU FONTS KANABADATAM LEDU. NAA SYSTEM O.S.-Microsoft-windowsXP professional. Browser-Mozilla Fire Fox. toorupu tirigi danDam pettamantaaraa>................. . . . .
____ANNA. ..

Dr.Pandu Ranga Sharma Ramaka said...

చాలా చక్కని సలహాలు ఇచ్చారు.నాకు బాగానే పని చెస్తున్నయి మీ సలహాలు.

my blog -

www.teluguthesis.blogspot.com

:a: :b: :c: :d: :e: :f: :g: :h: :i: :j: :k: :l: :m: :n:

Post a Comment