ఈ నెల ఒకటవ తేది నుండి పదకొండవ తేది వరకు విజయవాడలొ జరుగుతున్న 20వ పుస్తక ప్రదర్శనలో నాల్గవ రోజైన నాల్గవ తేది రెండు ప్రత్యేకతలని సంతరించుకున్నది. వాటిలో మొదటిది ప్రతి సంవత్సరం 4 వ రోజు జరిగే పుస్తక ప్రియుల పాదయాత్ర అయితే రెండవది ఈ పాదయాత్ర మరియు ప్రదర్శన ల లొ ‘e-తెలుగు’ ఒక ప్రత్యేకత గా రూపొందటమే కాకుండా వందలాది మందిని ఆకర్షించి వారి డెమో వద్ద వారిని కట్టిపడేయటం.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి వచ్చిన etelugu.org’ యోధానుయోధుల్లొ కొందరు ప్రముఖంగా కనిపిస్తే, కార్యక్రమం మొత్తాన్ని విజయం దిశగా నడిపించిన శ్రీ పాలపర్తి శ్రీకాంత్ గారు (వారి పరిచయాలు, వారికున్న సదుపాయాలు, వారి అభిరుచి కలగలిపి), అలాగే తన సహజశైలితొ తనకున్న మీడియా బలాన్ని ‘e-తెలుగు’ బలంగా మార్చి ఎంతొ శ్రమించిన తెలుగుకళ బ్లాగర్ పద్మకళ గారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే ఎంతో శ్రమకోర్చి ఈ కార్యక్రమం ఆసాంతం పాల్గొన్న ‘‘జీవితంలో కొత్తకోణం" బ్లాగర్ శ్రీనివాసకుమార్ గారు ఏలూరు నుండి, కంప్యూటర్ ఎరా లైవ్ చాట్ లొ చాలా మందికి కంప్యూటర్ మరియు అంతర్జాలంలొ తెలుగు ఉపయోగించటం లొ నిరంతరం తక్షణ సహాయం అందించే శ్రీ శ్రినివాస్ కర గారు మచిలీపట్నం నుండి పాల్గొనటం జరిగింది.
ముందుగా జరిగిన పుస్తక ప్రియుల పాదయాత్ర లొ ‘e-తెలుగు’ బ్యానర్లు ప్రముఖంగా కనపడే విధంగా పాల్గొనటం జరిగింది. (వ్యక్తిగత సమస్యల వలన ఈ పాదయాత్ర లొ నేను చివరిలొ వచ్చి కలవటం మాత్రమే జరిగింది).
నేను శ్రీనివాస్ కర గారు పుస్తక ప్రదర్శన (మహాత్మా గాంధి రోడ్ వైపున్న గేట్) వద్దకు చేరుకోగానే ‘e-తెలుగు’ అద్యక్షులు శ్రీ తుమ్మల శిరీష్ కుమార్ గారిని కాంటాక్ట్ చేయటం, వారు స్టేట్ గెస్ట్ హౌస్ వైపున్న గేట్ వద్ద నుండి సరంజామాతో లోపలకు వస్తున్నట్లు సమాచారం తొ మేమిద్దరం ప్రదర్శన లొకి ఎంటర్ అయ్యాం. వెంటనే మాకు పాదయాత్ర అక్కడకు చేరుకుంటూ కనపడటం దానిలొ ‘e-తెలుగు’ బ్యానర్లతొ కొంత మంది బ్లాగ్ ల ద్వారా పరిచితమైన అపరిచితులు మాకు కనిపించారు. శ్రీ శిరీష్ కుమార్ గారు తాము వేరే చోట ఉన్నామని చెప్పారు కదా, మరి వీళ్ళెవరు అనే మీమాంసతో దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకున్నపుడు అదొ చెప్పలేని ఆనందం, ఎందుకంటే మేం తరచుగా కూడలి లో చూసే బ్లాగర్లు వీరే అని తెలిసింది కాబట్టి. హైదరాబాద్ నుండి వచ్చిన ‘e-తెలుగు’ బృందం సభ్యులైన మురళి గారు, యనమండ్ర సతీష్ కుమార్ గారు, చావా కిరణ్ గారు, దాట్ల శ్రీనివాసరాజు గారు, అరుణ పప్పు గారు, ఏలూరు నుండి వచ్చిన శ్రీనివాసకుమార్ గారు మొదలైన వారితో పరిచయాలు చేసుకుని తర్వాత ఒక బ్యానర్ ను నేను శ్రీనివాస్ కర గారు చేతబట్టి కాసేపు వారితో పాటు నడిచి మేమూ పాదయాత్రలో పాల్గొన్నాం అనిపించాం. అంతలో శ్రీ తుమ్మల శిరీష్ కుమార్ గారు, పాలపర్తి శ్రీకాంత్ గారు రావటం తొ పరిచయాలు పూర్తయ్యాయి.

43 వ నెంబరు స్టాల్ ఎదురుగా ‘e-తెలుగు’ బ్యానర్లు కట్టి, ఆ స్టాల్ వారి కి సంబంధించిన రెండు టేబుల్స్ ను మన ప్రదర్శన కు సమకూర్చుకుని ఇక అక్కడకు వచ్చిన వారికి, ఇటు చూస్తూ అడుగదామా వద్దా అనుకుంటూ అటుగా వెళ్ళి పోతున్న వారికి నేను, శ్రీనివాస్ కర గారు, సతీష్ గారు కరపత్రాలు పంచిపెడుతుంటటం, అడిగిన వారికి సందేహాలు నివృత్తి చేస్తూ 7 గంటలకు “ప్రతిభ వేదిక” వద్ద లైవ్ డెమో ఉందని చెప్పటం జరిగింది. దాట్ల శ్రీనివాస రాజు గారు, చావా కిరణ్ గారు, అరుణ గారు, మురళి గారు మిగతా ఏర్పాట్లపై చర్చించు కుంటూ సంసిద్దులౌతుండగా పద్మకళ గారు రానే వచ్చారు, వారితో పాటు ఎఫ్ ఎం రేడియో సిబ్బంది, దానిలొ ‘e-తెలుగు’ గురించి చెప్పించటం జరిగింది. వృత్తిలొని సారూప్యత తో అరుణ గారు, పద్మకళ గారు చాలా సేపు కలిసే ఉండి ప్రతి సమయంలొనూ చాలా చక్కగా ప్రోగ్రాం రూపుదిద్దుకునేటట్లుగా ప్రయత్నం చేస్తుంటే మరో ప్రక్క శిరీష్ కుమార్ గారు, శ్రీ కాంత్ గారు పుస్తక ప్రదర్శన నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ కనిపించారు. ఈ లొగా సతీష్ కుమార్ గారు, నేను, కొంత మంది విద్యార్ధిని, విద్యార్ధులతో పాటు గా వచ్చిన ఉపాద్యాయ బృందాన్ని కలిసి ‘e-తెలుగు’ గురించి, జరగబోయే కార్యక్రమాన్ని గురించి వివరించటం, వారెంతో ఆసక్తి కనపరచటం మాకు సంతోషాన్నిచ్చింది.
ఇక సాయంత్రం గం.6.30 ని. లకు శిరీష్ కుమార్ గారి సూచన మేరకు అందరం ఇక్కడి కార్యక్రమాన్ని ముగించి “ప్రతిభ వేదిక” వద్దకు చేరుకున్నాం, అక్కడ ప్రదర్శనకు సంబంధించిన ఒక్కో ఏర్పాటు హైదరాబాద్ మిత్రులు చూసుకోవటం, స్టేజి కి కావలసిన సదుపాయాలు, ప్రదర్శనను తిలకించే వారికోసం కుర్చీల ఏర్పాటు చక చకా శ్రీకాంత్ గారు చేయటం, మీడియాను కాంటాక్ట్ చేయటం, అక్కడకు మీడియాతో పాటు గౌరవనీయులు శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ (ఆల్ ఇండియా రేడియో, విజయవాడ, స్టేషన్ డైరెక్టర్) గారు సమయానికి వచ్చే విధంగా చేయటం లో పద్మకళ గారు నిమగ్నమై కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు.
ఇక స్టేజి పైకి వచ్చి ముఖ్య అతిధిగా గౌరవనీయులు శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు పాల్గొని ఈ కార్యక్రమానికి ఆయన మాటలతో జీవం పోశారు. అక్కడ ఏర్పాటుచేసిన కుర్చీలు చాలకపోయినా చాలా మంది అలాగే నుంచుని కార్యక్రమాన్ని తిలకించారు.
ఆ తర్వాత అద్యక్షులు తన ఉపన్యాసంలో ‘e-తెలుగు’ ఆవిర్భావం, దాని లక్ష్యాలు, తమ నిరంతర ఉచిత సేవ మొదలైన వాటిపై మాట్లాడారు. ఆ తర్వాత శ్రీ మురళీ గారు, చావా కిరణ్ గారు లైవ్ షోను వివరించగా, దానికి సంబంధించిన కంప్యూటర్ ఆపరేషన్ శ్రీ దాట్ల శ్రీనివాస రాజు గారు చేపట్టారు. ముందుగా లేఖిని సృష్టికర్త, కూడలి సమన్వయకర్త అయిన శ్రీ వీవెన్ గారి www.lekhini.org ద్వారా కంప్యూటర్, అంతర్జాలం లలో తెలుగు ఎలా వినియోగించాలి అనేది శ్రీ మురళి గారు వివరించగా, బ్లాగ్ అంటే ఏమిటి, తెలుగు బ్లాగ్, దాని పుట్టు పూర్వోత్తరాలు మొదలైన వాటి గురించి కంప్యూటర్ ఎరా మాగజైన్ ఎక్జిక్యూటివ్ ఎడిటర్, సాంకేతిక బ్లాగర్, కంప్యూటర్ ఎరా లైవ్ చాట్ ద్వారా అనేక మందికి తక్షణ సహాయంలో అప్పటికపుడు తెలుగు ను నేర్పించటానికి ఆద్యుడు అయిన శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు ‘e-తెలుగు’ మరియు బ్లాగ్ లకు సంబంధించిన సాంకేతిక విషయాలపై రూపొందించిన వీడియో ల సహాయంతొ శ్రీ మురళి గారు, చావా కిరణ్ గారు లైవ్ డెమో వలె చూపించారు.
ఆద్యంతం వీక్షకులు ఎంతో ఆసక్తితో ఉండటం కనిపించింది. ఇక వేదిక ప్రక్కన కార్యక్రమం లొ మీడియాతో ముచ్చట్లు, ప్రముఖ మానసిక వైద్యులు డా. ఇండ్ల రామ సుబ్బారెడ్డి గారితొ పరిచయం చేసుకుని వారికి ‘e-తెలుగు’ గురించి వివరించటం మిగిలిన వారు చూస్తూ ఉన్నారు.
కార్యక్రమం మధ్యలో వీక్షకులలో ఒక్కరు కూడా వెళ్ళిపోకుండా చివరి వరకు ఎంతో ఇంటరెస్ట్ గా వీక్షించటం, ఆ తర్వాత ఎన్నో వివరణలు కోరటానికి ముందుకు రావటం, ముఖ్య అతిధి అయిన గౌరవనీయులు శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు చివరివరకు కార్యక్రమాన్ని తిలకించటం కార్యక్రమం విజయవంతమైందనటానికి నిదర్శనం.
ఇదంతా బాగానే ఉంది కాని 83 సంవత్సరాల వయస్సులొ ఈ కార్యక్రమాన్ని అంతటినీ ముందువరుసలో కూర్చొని వీక్షిస్తున్న పెద్దాయన ఎవరా అని అందరం ఆలోచనలో పడ్డాం, తర్వాత శ్రీ శిరిష్ కుమార్ గారు వారిని శ్రీ సుబ్బారావు గారని, మనందరికి సుపరిచితులైన “కొత్త పాళి” గారి మామ గారని తెలపటం తో ఆ టైం లో వారితో సహా అందరం కొత్తపాళి గారిని గుర్తుకు తెచ్చుకుని ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాం.
మరో ఆనందకరమైన విషయం ఏమిటంటే ఒక యువకుడు వాలంటరీగా తనకు తానే అందరి వద్దకు వెళ్ళి అడిగి మరీ వారందరి ఈ మెయిల్ ఐడి లు సేకరించటం అబ్బురపరచింది. ఇక్కడ నన్ను క్షమించాలి, ఆ యువకుని పేరు నాకు గుర్తుకు రాక ఇక్కడ వ్రాయలేకపోతున్నందుకు.
కార్యక్రమం అలా ముగిసిన తర్వాత శ్రీ శిరీష్ కుమార్ గారు అందరికి కృతజ్ఞతలు తెలియచేస్తూ వేదిక మీద కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లు గా ప్రకటించారు. ఇంతటితో అయిపోలేదండోయ్. మరొక అరగంట పాటు స్టేజ్ వద్దే ఉండి అక్కడకు వచ్చిన ఎంతో మందికి అందరూ e-తెలుగు గురించి తెలియచేస్తూ మరింత ప్రచారం నిర్వహించారు. ఈ లోగా శ్రీ శ్రీనివాసరావు గారు, వారి స్నేహితులు మా అందరికి స్వీట్లు, పళ్ళు పంచిపెట్టారు, అది శ్రీ శ్రీనివాస రావుగారి తండ్రిగారి పదవీ విరమణ సందర్భంగా అని తెలియటంతో అందరం వారి నాన్న గారికి “హాపి రిటైర్డ్ లైఫ్” అని శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలొ శ్రీ గీతాచార్య గారు ఉత్సాహంగా కలిసిపోయారు (శ్రీ గీతాచార్య గారి గురించి నాకు అస్సలేమి తెలియదు, అందువలన మరింత గా వారి గురించి వ్రాయలేకపోతున్నాను, గీతాచార్య గారు క్షమించాలి). అక్కడ ఉన్న అందరం కలిపి గ్రూప్ ఫొటొలొ మా ఆనందాన్ని భద్రపరచుకున్నాం.
మర్చిపోయానండోయ్! అరుణ గారు ఆమె అభిమానం తొ పాటుగా మధ్యలో వేడి వేడిగా ఉండే ‘‘మిరపకాయ బజ్జీ’’ లని రుచి చూపించారు.
మర్చిపోయానండోయ్! అరుణ గారు ఆమె అభిమానం తొ పాటుగా మధ్యలో వేడి వేడిగా ఉండే ‘‘మిరపకాయ బజ్జీ’’ లని రుచి చూపించారు.
ఆ తర్వాత అలసిపోయిన ప్రాణాలన్ని సేద తీర్చుకోవటం, ఉడతా భక్తిగా వారికి స్థానికులం తేనీరు అందివ్వటం, చెప్పలేక, చెప్పలేక వీడ్కోలు చెప్పి ఇంటిముఖం పట్టాం, హైదరాబాద్ యోధులు హైదరాబాద్ కు, శ్రీనివాస్ కర గారు మచిలీపట్నం, శ్రీనివాస కుమార్ గారు, వారి మిత్రులు ఏలూరుకు ప్రయాణమై వెళ్ళిపోయారు. మరుసటి రోజు సాక్షి పేపర్ లొ పద్మకళ గారు అందించిన న్యూస్ “సెంటర్ స్ప్రెడ్” లొ వచ్చింది.
ఈ పోస్ట్ లొ పొందుపరచేందుకు ఫొటోలను పంపినందుకు శ్రీ దాట్ల శ్రీనివాస రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
ఇక చివరిగా ఒక మాట చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. ఎంతో మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంప్యూటర్ లో, మరియు అంతర్జాలం లో తెలుగు వ్యాప్తికి తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. కంప్యూటర్ ఎరా లైవ్ చాట్ లొ ఎన్నో వందల మందికి పగలూ రేత్రి అనకుండా కంప్యూటర్ లో తెలుగు నేర్పటం, ప్రచారం చేయటం రోజూ చేస్తుండగా, తెలుగు బ్లాగ్ ల మహారాణి అంటే తక్కువేనేమో అనిపించేటంతగా శ్రీమతి వలబోజు జ్యోతి గారు దాదాపుగా వంద తెలుగు బ్లాగ్ లకు (వాటి క్రియేషన్ లేదా కష్టమైజేషన్ లేదా డిజైనింగ్) ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని రోజూ సహాయం అందిస్తూనే ఉన్నారు. అంతే కాదు శ్రీ శ్రీనివాస్ కర గారు మచిలీపట్నం చేరుకుని రాత్రి 12.46 కు కూడా మరల అలాంటి సహాయం చేయటానికి సిద్ధమైపోవటం కూడా ఈ లైవ్ చాట్ ప్రాముఖ్యతను చాటుతున్నాయి. టీమ్ వ్యూయర్ లాంటి రిమోట్ అడ్మిన్ సాఫ్ట్ వేర్ ద్వారా వేరొకరి పర్మిషన్ తో వారి కంప్యూటర్ లోకి వెళ్ళి తక్షణమే ఆయా కంప్యూటర్లకు తెలుగు నేర్పిన సందర్భాలు ఎన్నో ఈ లైవ్ చాట్ లో. అలాగే కంప్యూటర్, అంతర్జాలం ల లో తెలుగుకు సంబంధించిన ఎన్నో ఉపయోగకరమైన ట్యుటోరియల్ లకు లింక్ లు కూడా ఈ చాట్ లో వెంటనే అందించటానికి కూడా ఏర్పాటు ఉంది. ఇలాంటి లైవ్ చాట్ ప్రస్తావన ఈ కార్యక్రమం లో అసలు లేకపోవటం ఒకింత ఆశ్చర్యమే. ఈ ప్రచారోద్యమాన్ని ఇలాంటి అన్ని సదుపాయాలతో సమన్వయం చేసుకుని ముందుకెళితే బాగుంటుందనేది నా అభిప్రాయం.
అదే విధంగా చాలా మంది సందర్శకులు స్థానికంగా ఎవరైనా ఇక్కడ సహాయం చేసే వాళ్ళున్నారా అని అడగటం గమనించటం జరిగింది. దీనిని బట్టి చాలా మంది అంతర్జాలం లొ http://etelugu.org కి వెళ్ళటానికి ఇష్టపడటమే కాక ఎవరైనా స్థానికంగా ఉంటే ఉత్తరోత్తరా సహాయం దొరుకుతుంది అనేది వారిలొ మరింత నమ్మకాన్ని, ఆచరణ ను కలిగిస్తుందేమో అన్న భావన కలుగుతుంది. ఎక్కడికక్కడ ఆ విధంగా e తెలుగు సంస్థ బ్రాంచి లు అనలేకపోయినా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందనేది నా మరో అభిప్రాయం. విజ్ఞులైన e తెలుగు సభ్యులు నా అభిప్రాయాలను విశాల హృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ, అలాగే ఈ పోస్ట్ లొ ఎవరినైనా ప్రస్తావించక పోవటం జరిగితే అది పొరపాటునే కాని కావాలని కాదని అర్ధం చేసుకుంటారని, అలాంటి వారందరికి కూడా మన:పూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ . . . . .































20 comments:
నివేదిక చాలా బావుందండీ. నేను కూడా అక్కడే ఉన్నంత ఆనందించా :)
fantastic report!and the points you mentioned are noteworthy.
Wonderful!! all those who are involved in this... you guys are awesome!! march on!! :)
ప్రసాద్ గారు నివేదిక చాలా వివరంగా రాశారు. కళ్లకు కట్టినట్లుంది. టెంప్లేట్ చాలా బాగుందే! చాలా రోజుల తర్వాత చూశాను. బ్లాగు లుక్ మొత్తం ఆకర్షణీయంగా మారిపోయింది. మరో విషయం.. మీ అమ్మగారికి అంత లాస్ట్ మూమెంట్స్ లో కూడా ఆ క్షణం వరకూ దగ్గరుండి చూసుకుని వీలుచేసుకుని అక్కడకు హాజరై అటు బ్లాగర్ గానూ, ఇటు కంప్యూటర్ ఎరా అడ్మిన్ గానూ మీరు స్పెండ్ చెయ్యడం శ్రీనివాస్ కర గారు ఆరోజు రాత్రి నాకు కాల్ చేసి చెప్పినప్పుడు చాలా బాధ అన్పించింది. నిజంగా మాటలతో మీ రుణం తీర్చుకోలేము.
Who said Indians don't excel collectively!! Look at you!! Kudos.. You guys are very inspiring to all of us.
Thanks for your work
Kumar N
కొత్తపాళి గారు, రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు, యోగి గారు, నల్లమోతు శ్రీధర్ గారు, kumar గారు - మీ అందరూ వెంటనే స్పందించి ఈ ఉద్యమం లొ మనందరం కలిసి ఉన్నాం అనేది చెప్పకనే చెప్పారు, ధన్యవాదాలు.
శ్రీధర్ గారు ఎంతో మంది ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అహర్నిశలూ పనిచేస్తున్నారు, అలాగే మీ లాంటి వారు ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెట్టి పనిచేస్తున్నారే, మీ అందరితో పోల్చుకుంటే నా కంట్రిబ్యూషన్ రుణం తీర్చుకోలేనంత గొప్పదేం కాదండి.మీ అభిమానానికి ధన్యవాదాలు.
ప్రసాదు గారూ, చక్కని నివేదిక ! మీరిచ్చిన సలహాలు - ముఖ్యంగా ప్రతిచోటా e-తెలుగుకు ప్రాతినిధ్యం ఉండాలి అనేది - ఆచరణీయాలు. 2010 ప్రదర్శనకు బయటినుండి ఎవరూ రావాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నాను.
కంప్యూటర్ ఎరా చాట్ ప్రస్తావన రాకపోవడం లోపమే! అటువంటివి జరగకుండా చూసుకోవాలి.
'నవ్వులాట' శ్రీకాంత్, 'కొత్తబంగారులోకం' పద్మకళ ఈ కార్యక్రమానికి మూల స్తంభాలు. వారిద్దరినీ సముచితంగా ప్రస్తావించారు.
కంప్యూటర్ లో, మరియు అంతర్జాలం లో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న ఎందరో మహానుభావులు అందరికీ నా మన:పూర్వక ధన్యవాదములు. ప్రసాద్ గారు మీ నివేదిక చాల విపులంగా మేము విజయవాడ పుస్తక ప్రదర్సన చూస్తున్నంత ఆనందంగా ఉంది. మరి మా వైజాగ్ కి ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో? . e-తెలుగు సందడిలో పాలుపంచుకున్న అందరికీ నా ధన్యవాదాలు.
చాలా సమగ్రమైన నివేదిక! మేమంతా అక్కడే ఉన్నంతగా ఆనదించాము. నవ్వులాట శ్రీకాంత్ గారు కూడా పాలడుగు వారేనా! చివర్లో చదువరి గారు చెప్పేదాకా నేను "దైవానిక"(ఆయనా పాలడుగు శ్రీకాంతే) అనుకున్నాను.
ప్రేక్షకులంతా ఆసక్తిగా చివరి వరకూ కూచున్నారని చదివి ఎంతో ఆనందం కలిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు!
చక్కటి నివేదిక ప్రసాద్ గారు. కార్యక్రమం అంత విజయవంతం గా నిర్వహించిన మీ అందరికీ నా అభిననదనలు
ప్రసాద్ గారు,
చక్కని నివేదిక. మేము కూడా అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. ఏ ఒక్క అంశం మిస్ కాలేదేమో. మీ అందరికి అభినందనలు..
ప్రసాద్ గారు,
మీ అభిమానానికి నెనర్లు .నా ఇంటి పేరు "పాలపర్తి" ,పాలడుగు కాదు.
:f:
కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు.. ధన్యవాదాలు.. ఫోటొలు చూస్తుంటే ఒకప్పుడు అదే బుక్స్ ఎగ్జిబిషన్ లో తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి.
పాల్గొన్న అందరికీ పేరు పేరునా అభినందనలు..
Nice coverage with link to photograph.
ప్రసాద్ గారూ
మీ నివేదిక చక్కగా ఉంది.
ఎట్టకేలకు e-తెలుగుకి మంచిరోజులు వచ్చాయి. ఇక్కడ హైదరాబాదులోను, తర్వాత విజయవాడలోను ప్రదర్శనలు విజయవంతమడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఎందరో మహానుభావులు. అందరికీ శతకోటి వందనాలు.
- దూర్వాసుల పద్మనాభం
చాలా బాగుందండీ.విశేషాలని చక్కగా రాసారు.
chaduvari గారు, వర్మ గారు, సుజాత గారు, laxmi గారు, జ్యోతి గారు, నవ్వులాట శ్రీకాంత్ గారు, నిషిగంధ గారు, అరుణాంక్ గారు, పద్మనాభం దూర్వాసుల గారు, శ్రీ గారు - మీ అందరి అభిమాన కామెంట్ లకు ధన్యవాదాలు.
పై పోస్ట్ లొ తప్పులను సరిచేసుకుంటూ కొన్ని మార్పులు చేయటం జరిగింది, గమనించగలరు.
శ్రీకాంత్ గారు, మొదటి పరిచయం లొనే తప్పటడుగు వేయటం జరిగింది, మీ ఇంటిపేరు విషయంలో, క్షమించాలి, ఆ తప్పును సరిచేశాను.
వర్మగారు, వైజాగ్ లో అవకాశం రాకపోవటం ఏమిటండి, మనమే అవకాశాన్ని వెతకాలి, అంత పెద్ద మహా నగరంలొ ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, లేదంటే బీచ్ లో ప్రదర్శన పెట్టినా బాగానే ఉంటుంది. మీరు ప్లాన్ చేసి శిరిష్ గారికి చెబితే తగిన సూచనలు చేసి అక్కడ కూడా జరిగేవిధంగా చూస్తారని అనుకుంటున్నాను.
సుజాత గారు నవ్యులాటశ్రీకాంత్ గారి ఇంటిపేరు విషయంలో పొరపాటు పడ్డాను, అదిప్పుడు సరిచేయటం జరిగింది, గమనించగలరు.
జ్యోతి గారు, బ్లాగ్ లు, కంప్యూటర్ మరియు అంతర్జాలంలొ తెలుగు విషయంలో మీరు నాకు గురువులు, అలాగే మీరిచ్చిన ప్రోత్సాహమే నేను ఈ పోస్ట్ వ్రాయటానికి ముఖ్య కారణం. ఏ ఒక్క అంశం మిస్ కాలేదేమో, అని మీరన్న తర్వాత గుర్తుకు తెచ్చుకుని మరీ ఒక ముఖ్య విషయాన్ని జోడించాను, పైన నీలం కలర్ లో కొత్తగా జోడించిన విషయం మిస్ కాకూడనిది మిస్ అయ్యింది. ధన్యవాదాలు.
దూర్వాసుల పద్మనాభం గారు, మీరు హైదరాబాద్ ఈవెంట్ లొ ఎంత కమిట్ మెంట్ తో పాల్గొన్నారో శ్రీ నల్లమోతు శ్రీధర్ గారి నివేదిక ల ద్వారా తెల్సింది. మీ వంటి పెద్దల ఆశీస్సులుంటే ఏ కార్యక్రమం మాత్రం విజయవంతం కాదు?
అందరికి మరొక్కసారి ధన్యవాదములతో . . . .
ప్రసాద్ గారూ... చాలా చాలా చక్కని నివేదిక. దీనిని అందరూ ప్రశంసించారు. నేను చెప్పడానికేముంది. గురువారం జెమినీ న్యూస్‌లో వార్త ప్రసారమైనట్లు జీ న్యూస్ మీరా హుస్సేన్ గారు చెప్పారు. ఇది తర్వాతి బులిటెన్లలో పునఃప్రసారమవుతుందన్నారు.
prasad garu andaru kalisi program chala chakka nirvahincharu, andariki dhanyavadalu.Mi blog kooda kotta roopu santaruinchukundi.Smileylu baunnayi.
Post a Comment