డాస్ పరిజ్ఞానం అక్కర లేదు - అనేక ప్రోగ్రాం లను ఒకేసారి రన్ చేసే బాచ్ ఫైల్స్ తయారుచేసుకోండి




మీకు డాస్ తో పరిచయం లేకున్నా బాచ్ ఫైల్స్ తయారు చేసుకోవచ్చు.


679.45KB సైజ్ కలBatchrun అనే ఉచిత ప్రోగ్రాం ఉపయోగించి మనకు DOS తెలియకపోయిఃనా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న బాచ్ ఫైల్స్ ను గ్రాఫికల్ ఇంటర్ ఫేస్ లో తయారుచేసుకుని రన్ చేసుకోవచ్చు. 

ఇదివరకటి రోజుల్లో మనం బాచ్ ఫైల్స్ (.bat) గురించి విన్నాం, వాటిని DOS లో చేసుకోవటానికి కొంత అనుభవం, అవగాహన కావలసి వచ్చేది, కాని ఇపుడు డాస్ లొ వలె కాకుండా అంతగా డాస్ పై అవగాహన లేకపోయినా మంచి గ్రాఫికల్ ఇంటర్ ఫేస్ లో యూజర్ ఫ్రెండ్లీ గా చాలా తేలికగా బాచ్ ఫైల్స్ తయారు చేసుకోవటానికి ఉపయోగపడేదే ఈ Batchrun.



Batchrun తో మనకు .brs batch files ఏర్పడతాయి, ఎన్ని ప్రోగ్రాంలు మరియు డయలప్ కనెక్షన్స్ నైనా ఒకేసారిగా ఈ బాచ్ ఫైల్ తో ఒకే ఒక్క క్లిక్ తో రన్ చేసుకోవచ్చు. అంతే కాకుండా స్టార్టింగ్ ప్రాసెస్ ను కూడా priority లేదా run mode వంటి ప్రాపర్టీస్ తో అనేక విధాలుగా కంట్రోల్ చేసుకోవచ్చు. 
దీనిలో అంతర్గతంగా న్న ఉన్న ఫైల్ మానేజ్ మెంట్ ఫంక్షన్స్ అలా ఎన్నో ప్రోగాం లను రన్ చేయగలగటమే కాకుండా Copy, Rename, Makedir, Delete మరియు End Process వంటి ఫంక్షన్స్ ను కూడా చేసుకోవచ్చు. Batchrun బాచ్ ఫైల్స్ ను ఎక్స్ప్లోరర్, ద్వారా లేదా స్టార్ట్ అప్ ఫోల్డర్ ద్వారా లేదా డెస్క్ టాప్ పైన ఉంచుకుని కూడా లాంచ్ చేయవచ్చు. 

మరిన్ని వివరాలకు, ఉచిత డౌన్ లోడ్ కు క్రింది లింక్ ను క్లిక్ చేయండి:
http://www.outertech.com/index.php?_charisma_page=product&id=1

0 comments:

:a: :b: :c: :d: :e: :f: :g: :h: :i: :j: :k: :l: :m: :n:

Post a Comment